విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
- ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరేలా సకల సదుపాయాలు కల్పిస్తున్నాం..
- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
అశ్వాపురం, ఏప్రిల్ 23, (విజయక్రాంతి): విద్యా వైద్యం గ్రామీణ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరేలా సకల సదుపాయాలు కల్పిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మణుగూరు మండలం లంక మల్లారం భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని బీటీ రహదారి పనులకు శంకుస్థాపన చేసి, టీటీఆర్జేసీ బాలికల డార్మెటరీ హాల్ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నా మన్నారు. ఇటీవలనే రూ 2.70 కోట్ల వ్యయంతో బాలికల వసతి గృహాన్ని ప్రారంభించామని, పేద పిల్లలు కూడా ధనికుల పిల్లలతో సమానంగా చదువుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ప్రవేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు.
విద్య పట్ల ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు అనేక నిదర్శనాలు ఉన్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్య ఇస్తూ రూ రెండు కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మిస్తోందన్నారు. ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయడంతో పాటు గిరిజన అభివృద్ధి కోసం అదనంగా వెయ్యి ఇండ్లు మంజూరు చేశారని గుర్తు చేశారు.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిలు పెంచి పోషకాహారం అందిస్తుందన్నారు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునే ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, గ్రామ సర్పంచ్ పూనెం రమేష్,పాఠశాల ప్రిన్సిపాల్ రాణి తదితరులు పాల్గొన్నారు.
ఆంజనేయ అందర్ని దీవించండి
కూసుమంచి, ఏప్రిల్ 23(విజయక్రాంతి): కూసుమంచి మండలం లింగారం తండా గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి, ధ్వజస్తంభం, నవగ్రహాలు, జంట నాగులు, నాభిశీల, స్థిర విగ్రహ యంత్ర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ పవిత్ర కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొనడం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక ఉత్సాహం నింపారు.
గ్రామ ప్రజల అభివృద్ధి, శాంతి, సౌభాగ్యాల కోసం దేవుని ఆశీస్సులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత సర్పంచ్ బానోత్ పుష్ప-మ,రవి కుమార్, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.






