calender_icon.png 6 May, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తాచాటిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు

22-04-2025 10:14:11 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. కళాశాల ఏర్పడిన నుండి ఇప్పటివరకు ఎంపీసీ, బైపిసి, సీఈసీ, HEC లలో ఊహించనీ ఫలితాలను సాధించడం గర్వంగా ఉందని  కళాశాల ప్రిన్సిపల్ వి ఆంజనేయరావు పేర్కొన్నారు. మొదటి సంవత్సరంలో ఎంపీసీ నుండి రాష్ట్రస్థాయి మార్కులను కే అభిరామ్ 463/470, బి శ్రావణి 446/470, పి అభిరామ్443/470, ఆర్ వర్షిత 416/470 లు సాధించారన్నారు. బైపిసిలో జే మాధవి 379/440 అత్యున్నత మార్కులు సాధించారన్నారు.

సిఇసిలో పి అర్చన 386/500, HECలో టి అఖిల 400/500లు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి కళాశాల పేరుని రాష్ట్ర స్థాయిలో నిలబెట్టారన్నారు.. ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ నుండి కె సిరి చందన 879/1000, బైపిసి నుండి జార మరియం 873/1000 మరియు HEC నుండి ఎం రామ్ చరణ్ 928/1000 మార్కులు సాధించారన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వి ఆంజనేయరావు మాట్లాడుతూ... అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ కళాశాల పేరును రాష్ట్రస్థాయిలో నిలబెట్టినందుకు అత్యున్నత ఫలితాలు అందించినందుకు విద్యార్థినీ విద్యార్థులు అందరికి అభినందనలు తెలిపారు. కళాశాల మొదటి సంవత్సరం 40%, ద్వితీయ సంవత్సరం 42% ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కళాశాల అధ్యాపకులు మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులు అందరిని అభినందించారు.