calender_icon.png 7 May, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు..

06-05-2025 09:45:56 PM

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం సర్వే నెంబర్ 354 లో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. సుమారు 15:30 ఎకరాలు ఉన్న ప్రభుత్వ భూములను కబ్జా చేసి ధర్జాగా ప్రహరీ నిర్మించారు. ఈ కబ్జా వెనుక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఏకమై సర్కారు జాగాను ఖతం చేసేందుకు కంకణం కట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి.

గత కొద్ది రోజులుగా ఈ కబ్జాలపై హైడ్రా కార్యాలయానికి, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందాయి.దీంతో హైడ్రా అధికారులు,రెవెన్యూ అధికారులు సమన్వయంతో పోలీస్ బందోబస్త్ మధ్య అక్రమంగా వెలసిన నిర్మాణాలను కూల్చివేశారు.కూల్చివేతలలో హైడ్రా ఇన్స్పెక్టర్ నరేష్,కుత్బుల్లాపూర్ మండలం ఆర్ఐ ఖలీం, రెవెన్యూ, హైడ్రా సిబ్బంది పాల్గొన్నారు.