calender_icon.png 7 May, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశాడే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

06-05-2025 10:17:11 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్ లోని సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశడే మీటింగ్ లో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా INTUC క్యాలెండర్, ఆశ రిజిస్టర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఆశ కార్యకర్తల వేతనం పెంపు గురించి ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తానని మండలంలో ఉప కేంద్రాలకు అవసరమైన రోడ్లు, బోర్, ప్రహరీ గోడ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దినేష్, వెంకటేష్, దేవా, స్థానిక కాంగ్రెస్ నాయకులు కాలే ప్రసాద్, మాజీ ఎంపీటీసీ శ్రీను, బానోత్ రవి, రాందాస్, అశోక్, మోతిలాల్, అభినయ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.