calender_icon.png 7 May, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కాంత’ క్లాసిక్ లుక్

06-05-2025 10:02:34 PM

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ మూవీ ’కాంత’. స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, సముద్రఖని ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. మంగళవారం హీరోయిన్ భాగ్యశ్రీ బర్త్ డే. ఈ సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో భాగ్యశ్రీని క్లాసిక్ లుక్‌లో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేకర్స్ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: డాని శాంచెజ్ లోపెజ్, సంగీతం-: ఝను చంతర్; ఆర్ట్: రామలింగం, ఎడిటర్: లెవెల్లిన్ ఆంథోనీ గోన్సాల్వేస్, నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్, దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్.