calender_icon.png 7 May, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ పోస్టులను స్థానిక జనరల్ అసిస్టెంట్ లతో భర్తీ చేయాలి

06-05-2025 10:04:20 PM

ఎండి రజాక్...

కొత్తగూడెం (విజయక్రాంతి): సింగరేణి సంస్థలో సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ పోస్టులను స్థానిక జనరల్ అసిస్టెంట్లతో భర్తీ చేయాలని ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు ఎండి రజాక్(INTUC Vice President MD Razak) కోరారు. ఈ మేరకు మంగళవారం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం శాలెం రాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. నూతనంగా విడుదల చేసిన సర్కులర్ ప్రకారం సర్ఫేస్ లో ఉన్న, జనరల్ అసిస్టెంట్ పోస్టులను ఐదు సంవత్సరాలు అండర్ గ్రౌండ్ సర్వీస్ చేసినవారే అర్హులని సర్కులర్ విడుదలైందని, సింగరేణి ఏరియాలలో ఏ ఏరియాలోనైనా సర్ఫేస్ లో జనరల్ అసిస్టెంట్ పోస్టులను కచ్చితంగా  జనరల్ అసిస్టెంట్(అండర్ గ్రౌండ్) సీనియార్టీ ప్రకారంగా భర్తీ చేయాలని కోరారు. అండర్ గ్రౌండ్ ఏరియాలో జనరల్ అసిస్టెంట్లు ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురూ చూస్తున్నారని, వారికి సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ పోస్టులకు స్థానికంగా అవకాశం ఇచ్చినచో ఉత్పత్తి ఉత్పాదకత పెంచడంలో సఫలీకృతలవుతారన్నారు. అందుకు జిఎం సానుకూలంగా స్పందించారు.