06-05-2025 11:41:48 PM
ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్
హైదరాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ నోటిఫికేషన్ కోసం 33 జిల్లాల్లోని దళిత, గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఎదురుచూస్తున్నారని మంగళవారం ఒక ప్రకటనలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ రజనీకాంత్, టీ నాగరాజు తెలిపారు. ఉచితంగా చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.