calender_icon.png 7 May, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాస్కోలో విమానాశ్రయాల మూసివేత

06-05-2025 11:36:08 PM

వంద డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..

దాడులను సమర్థంగా తిప్పికొట్టిన రష్యా..

మాస్కో: రష్యా రాజధాని మాస్కోలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తూ ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ(Ministry of Defence) నిర్ణయం తీసుకుంది. మంగళవారం రష్యాకు చెందిన 12 ప్రాంతాల్లో ఉక్రెయిన్ వందకు పైగా డ్రోన్లతో దాడులు నిర్వహించింది. ఉక్రెయిన్ దాడిని సమర్థంగా తిప్పికొట్టినట్టు రష్యా రక్షణ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్ దాడుల వల్ల సరిహద్దులో ఉన్న తొమ్మిది ప్రాంతీయ ఎయిర్‌పోర్టులు స్వల్పంగా ధ్వంసమయ్యాయి.

దీంతో వాటిని కూడా తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు రష్యా పౌర విమానయాన సంస్థ రోసావియాట్సియా వెల్లడించింది. మరోవైపు రష్యా సరిహద్దు వద్ద ఉన్న ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నగరంపై రష్యా దళాలు 20కి పైగా డ్రోన్లను ప్రయోగించాయి. ఈ దాడిలో నలుగురు గాయపడగా.. దాదాపు 100 మార్కెట్ స్టాళ్లు ధ్వంసమయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధ విజయానికి 80వ వార్షికోత్సవం ‘విక్టరీ డే’ సందర్భంగా మే 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు రష్యా ఉక్రెయిన్‌పై పోరు విరమణను ప్రకటించిన సంగతి తెలిసిందే.