విద్యారంగ బలోపేతం దిశగా ప్రభుత్వ చర్యలు
- జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా
సందర్శించిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
ములుగు, జూలై31(విజయక్రాంతి):విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అన్నారు గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల,మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి, క్లాసు రూమ్ లను పరిశీలించి విద్యార్థినిలతో తెలుగు, ఇంగ్లీష్ , హింది సబ్జెక్టుల వారీగా వివరాలు అడిగి తెలుసుకొని,తెలుగు,ఇంగ్లీష్ పై పట్టు ఉండాలని,విద్యార్థులతో తెలుగు చదివించారు. ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగిందని తెలిపారు.






