01-08-2025 12:43:59 AM
* జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, జూలై 31(విజయక్రాంతి): జిల్లాలో అధిక ధరలకు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజారోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, నిజమైన అర్హులైన పేదలకు మాత్రమే ఇల్లు కేటాయించామని, ఫ్రైడే డ్రైడే కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. గురువారం అల్లాదుర్గం మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ ముందుగా గడి పెద్దాపూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను పరిశీలించారు.
స్టోర్, రక్త పరీక్ష గది, ఓపి రిజిస్టర్. పరిశీలించారు. జ్వరాలు ప్రబలిన ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాల నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి రోజు ఎంతమంది రోగులు వైద్య సేవలకు వస్తున్నారని వైద్యుల ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముస్లాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద లబ్దిదారులకు నీడ కల్పించాలనే గొప్ప ఉద్దేశ్యం తో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునే విధంగా లబ్దిదారులును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
త్వరిత గతిన ఇండ్లు నిర్మించుకొని సొంతింటి కల నెరవేర్చుకోవాలని అన్నారు. గ్రామాలలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఫ్రైడే-డ్రై డే ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. ఎరువులను దారి మళ్లించినా, బ్లాక్ చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు పోలీస్ కేసులు నమోదు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.