calender_icon.png 29 October, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొంథా తుఫాన్ బాధిత రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

29-10-2025 02:05:59 PM

మఠంపల్లి: సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలో అకాల మొంథా తుఫాన్ కారణంగా మఠంపల్లి మండలంలో తుఫాన్ తీవ్రత వల్ల పంట నేలాకోరగడంతో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని వెంటనే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గిరిజన శక్తి సంఘం జిల్లా అధ్యక్షుడు ధరవతు బాలకృష్ణ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నేలాకోరిగిన వరి పొలాలను పరిశీలించి ఆయన మాట్లాడారు. ఇప్పటికే వరి పంటకు ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతన్నలు వరి కోత దశలో ఉండగా తుఫాన్ తీవ్రరూపం దాల్చడంతో తీవ్రమైన పంట నష్టాన్ని  ప్రభుత్వం భరించి రైతులకు వెంటనే ఎకరానికి 30,000 రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించి ప్రభుత్వం రైతులపై తన ఉధారాబావాన్ని చూపి రైతులను ఆదుకోవాలని కోరారు.ఈ విషయంపై మండల ప్రభుత్వ ఉన్నతాధికారులు చొరవ తీసుకొని రైతులను ఆదుకునే దిశగా వరి పంట నష్టాని అంచనా వేసి నివేదికను ప్రభుత్వానికి అందించాలని కోరారు.