calender_icon.png 29 October, 2025 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెంథాన్ తుఫాన్ తో రైతన్న విలవిల

29-10-2025 03:03:37 PM

- ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వందల ఎకరాలలో వరి పైరు నేలకొరిగి నీట మునిగింది

- వరికంకి పాలు పోసుకొని ధాన్యంగా మారే కీలక దశలో వరి పొలాలు నేలకొరిగి నీట మునగడం తో రైతన్న వెన్నుపూస విరిగినట్లు అయింది

హుజూర్ నగర్: మెంథాన్ తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని అనేక గ్రామాలలో వందల ఎకరాలలో వరి పైరు నేలకొరిగి నీట మునిగింది. వరికంకి పాలు పోసుకొని ధాన్యంగా తయారు కాబోతున్న ఈ కీలక దశలో వరి పొలాలు నేలకొరిగి నీట మునగడం తో రైతన్న వెన్నుపూస విరిగినట్లు అయింది. మండలంలోని వివిధ గ్రామాలలో గల చెరువులు, బావులు, వాగులు, వంకలు, బోర్లు అన్ని నీటితో నిండి ఏ క్షణానైనా కట్టెలు తెంచుకునే ప్రమాదాన్ని పొంచి ఉన్నాయి. దీంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలో పలు రైతుల వరి పంట నీట మునిగి తీవ్ర నష్టాన్ని  కలిగించటంతో వారు ఆవేదన చెందారు. మండలంలోని వివిధ గ్రామాలలో ఎంత మేరకు వరి పంటకు నష్టం, నివాస గృహాలకు నష్టం వాటిల్లింది అనే సమాచారం అధికారుల నుంచి తెయాల్సి ఉంది.