29-10-2025 02:52:15 PM
ఓవర్ టెక్ చేయబోతూ..
రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ వద్ద సంఘటన
అబ్దుల్లాపూర్ మెట్: ఓవర్ టెక్ చెయబోతు ఆర్టీసీ బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన సంఘటన సోమవారం సంఘటన అంబర్ పేట్ లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్ నగర్ డిపో_1 చెందిన టీఎస్_07_ యు ఈ_ 5599 నెంబర్ గల టీజీఆర్టిసి బస్సు అనాజ్ పూర్ నుంచి ఉమెన్స్ కాలేజ్ కి బయలుదేరింది. మార్గ మధ్యలో పెద్ద అంబర్ పేట్ మీదుగా వెళ్తున్న క్రమంలో గండి చెరువు కామన్ వద్ద ప్రమాదానికి గురైంది. సాక్షుల ప్రకారం, మహేంద్ర బొలెరో వాహనాన్ని ఓవర్ టెక్ చేయబోయే క్రమంలో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా బస్సు రోడ్డు కిందకు దిగి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లినట్లు తెలిసింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎవ్వరికి ఇలాంటి ప్రమాదం జరగకపోవడంతో బస్సులో ఉన్న వాళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రయాణికులను బస్సులో నుంచి బయటకు దింపారు.