29-10-2025 03:07:46 PM
తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి అడవి ప్రాంతంలో ఒక కొండ పైన పడుకొని ఉన్న చిరుతను చూసిన వ్యవసాయ దారులు గతంలో గుండ్రెడ్డిపల్లి గ్రామ పరిధి అడవి ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు కొందరికి కనపడినట్లు తెలిపారు. అయితే బుధవారం ఉదయం అడవి ప్రాంతంలో ఉన్న పొలాల వద్దకు వెళుచుండగా కొందరు యువకులు కొండపై పడుకున్న చిరుతను చూసి గ్రామంలోని పలువురికి తెలియజేశారు. అంతేకాకుండాఅడవి ప్రాంత అధికారులు తక్షణమే చిరుతను అదుపులోకి తీసుకోవాలని ప్రజల ప్రాణాలను రక్షించాలని గ్రామస్తులు కోరినారు.