29-10-2025 02:01:53 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పులిగుండు తండా గ్రామపంచాయతీ పరిధిలోని కాలు నాయక్ తండ కు చెందిన చౌహన్ సరస్వతి (3) అనే బాలిక పాముకాటుతో మృతి చెందినట్లు బాన్సువాడ పట్టణ సిఐ శ్రీధర్ తెలిపారు. సీఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో పడుకుని ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి సరస్వతి వాంతులు చేసుకోవడంతో అది గమనించిన తల్లిదండ్రులు ఆమె కుడి కాలు పై ఏదో గుర్తు తెలియని విషపురుగు కరిచినట్లు ఘాట్లు గుర్తించడం జరిగిందన్నారు.
హుటా హుటేనా మెరుగైన చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయడంతో బుధవారం ఉదయం నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామం వద్ద మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్లు ఆయన తెలిపారూ.మృతురాలి తండ్రి చౌహన్ శ్రీకాంత్ దరఖాస్తు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు.