calender_icon.png 29 October, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంక్షేమానికి కృషి చేస్తాం

29-10-2025 03:00:16 PM

వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వర్ రావు

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వర్ రావు, మాజీ ఎంపీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున యాదవ్ అన్నారు. వారి  తండ్రి క్రీ.శే. అరిగెల  లక్ష్మయ్య 33వ వర్ధంతిని పురస్కరించుకొని ఇటీవల చిర్రకుంట గ్రామంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యుల సూచన మేరకు 60 మందిని బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో  బీపీ, షుగర్, సీబీపీ పరీక్షలు నిర్వహించి  ఆపరేషన్ నిమిత్తం ప్రత్యేక వాహనం లో వారిని ఆదిలాబాద్ లోని LV ప్రసాద్ ఆసుపత్రి కి పంపించారు. ఈ కార్యక్రమం లో సీనియర్ న్యాయవాది దీపక్ రావు, జిల్లా యూత్ అధ్యక్షులు గాజుల రాజేంద్ర ప్రసాద్, మండల అధ్యక్షులు సుంకరి పేంటు, మురళి గౌడ్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.