10-05-2025 12:07:02 AM
- ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
- బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి
- ప్రధానోపాధ్యాయులు రవీందర్
ఇబ్రహీంపట్నం, మే 9:ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కూడా తమ పాఠశాలలో చేర్పించాలని వినూత్న ప్రచారానికి దిగారు.
2025-26 విద్యా సంవత్సరంలో భాగంగా ప్రభుత్వం తలపెట్టిన బడిబాట కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ముందస్తుగా మే నెలలోనే ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం ఇంటింటి సర్వే నిర్వహించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులను గుర్తించి, వారి తల్లిదండ్రులతో అవగాహన కల్పించారు. ఇటీవల వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో నాగన్ పల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని, జిల్లాలో 3వ స్థానం, మండలంలో మొదటి స్థానం 574 మార్కులతో నిలిచారని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో అనుభవాజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన జరుగుతుందని, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత యూనిఫార్మ్, ఉచిత నోట్ పుస్తకాలు, మధ్యాహ్న భోజనము అందిస్తున్నట్లు తెలియజేశారు. దీనిపై తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేష్, ప్రమీల, లలిత తదితరులు పాల్గొన్నారు.