11-05-2025 08:39:30 PM
యువత మొత్తం పదార్థాలకు బానిసలవుతున్నారు
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురజా రామచంద్రం, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పార్ వెంకటేశ్వర్లు
మునుగోడు,(విజయక్రాంతి): అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలని, అధికారులు అనరులను గుర్తిస్తే తగిన మూల్యం తప్పదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురిజా రామచంద్రం అన్నారు. శనివారం రాత్రి పలివెల గ్రామ శాఖ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మొదటగా బస్టాండ్ సెంటర్లో గల పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గురిజా రామచంద్రం మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం సిపిఐ పోరాడుతుందన్నారు. నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులు,పెన్షన్లు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.
సంక్షేమ పథకాల ఎంపికలో అధికారులు అనరులను గుర్తిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పార్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లో యువత గంజాయి కొకైన్ లాంటి మత్తు మత్తుకు బానిస అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు వీటిపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. నాతి నరసింహ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో మాజీ జడ్పిటిసి గోస్కొండ లింగయ్య, మాజీ ఎంపీపీ మాధగోని సాయిలు,గ్రామ శాఖ కార్యదర్శి గోల్కొండ కృష్ణయ్య, సహాయ కార్యదర్శి ఆనగంటి నరసింహ, వరికుప్పల వెంకన్న, మాధగోని మల్లయ్య, గోస్కొండ మల్లేష్, మోహన్ రెడ్డి, పంతంగి నరసింహ, యాదయ్య, కృష్ణయ్య, రాములు, రాజు, దశరథ ఉన్నారు.