11-05-2025 08:34:35 PM
మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామిని తెలంగాణ సింగరేణి సంస్థ సీఎండి బలరాం నాయక్ దర్శించుకున్నారు. ముందుగా అర్చక స్వాములు పూర్ణకుంభ స్వాగతం పలికి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి అభిషేకాలు చేసిన అనంతరం శ్రీ సుభానంద దేవి అమ్మవారి ఆలయంలో పూజలు చేయించారు. అనంతరం ఆలయ ఈవో మహేష్ స్వామి వారి శేష వస్త్రాలతో సన్మానించగా అర్చక స్వాములు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం సీఎండి మాట్లాడుతూ రాబోయే సరస్వతి పుష్కరాలలో సింగరేణి సంస్థ తరఫున తమ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.