01-12-2025 05:28:12 PM
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): జిల్లా రుద్రంగి చెక్ పోస్ట్ వద్ద వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఆది శ్రీనివాస్ వాహనాన్ని అధికారులు ఆపి క్షుణ్ణంగా చెక్ చేశారు. వారికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పూర్తిగా సహకరించారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.