01-12-2025 05:25:13 PM
నిర్మల్ రూరల్: జిల్లాస్థాయి రోల్ ప్లే కాంపిటీషన్ లో భాగంగా నారాయణ స్కూల్ లో నిర్వహించిన పోటీల్లో విజేతలు అయిన సోఫీనగర్ గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థులకు ఫస్ట్ ప్రైస్ అలాగే రెండవ బహుమతి కేజీబీవీ జామ్ 9వ తరగతి విద్యార్థులకు గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి చేతులమీదుగా బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. మొదటి విజేతలైన సోఫినర్ విద్యార్థులకు రేపు రాష్ట్రస్థాయిలో ఎస్సీఆర్టీ గోదావరి ఆడిటోరియంలో జరిగే రోల్ ప్లే కాంపిటీషన్లో జిల్లా తరఫున పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త శ్రీ నర్సయ్య, జడ్జిగా వ్యవహరించిన కుబీర్ ఎంఈఓ విజయ్ కుమార్, అలాగే ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, రవి, అనసూయ పాల్గొన్నారు.