4 March, 2026 | 4:27 AM

సంక్షేమ పథకాలు అర్హులకు అందించేందుకు కృషి

04-03-2026 12:45 AM

గరిడేపల్లి,  మార్చి 3 : సంక్షేమ పథకాలు ప్రతి అర్హులకు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుగులోతు హేమ్లా నాయక్ అన్నారు.మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో మండలంలోని గారకుండా తండ గ్రామపంచాయతీ పరిధిలో వికలాంగుడైన శంకర్ కు ఆయన స్కూటీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

వికలాంగుల జీవితాలలో వెలుగులు నింపడం బిఆర్‌ఎస్ కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలన్నారు. వికలాంగులు ఇతరులపై ఆధారపడకుండా తమ పనులు స్వయంగా నిర్వహించుకునేలా మూడు చక్రాల స్కూటీలు దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ఎస్టి సెల్ మండల అధ్యక్షులు గుగులోతు సందీప్ నాయక్ మండల నాయకులు నరేందర్ నాయక్ మాజీ నీటిపారుదల సంఘం డైరెక్టర్ వెంకట్రావు గ్రామ పెద్దలు రతి రామ్ నాయక్, బాలు నాయక్, నాగేశ్వరరావు నాయక్,బచ్చలకూరి కోటయ్య మాజీ ఎంపీటీసీ వెంకట్ రామ్, రఘుపతి, నాగార్జున పలువురు పాల్గొన్నారు