calender_icon.png 9 December, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడా ప్రోత్సాహానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

08-12-2025 01:12:19 AM

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, డిసెంబర్  7 (విజయక్రాంతి):క్రీడలు యువతలో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలో నిర్వహించిన మొదటి రాష్ట్ర స్థాయి ఓపెన్ కుంగ్ ఫూ చాంపియన్షిప్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,‘ఆటలో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక దైర్యం పెరుగుతుంది. మన వేములవాడ ప్రాంతం ఎన్నో క్రీడాకారులకి నిలయంగా అవుతోంది. కరాటే, కుంగ్ఫూ వంటి యుద్ధకళల్లో విద్యార్థులు రాణించాలని ఆశిస్తున్నాను. ఈ క్రీడలు జీవనంలో వచ్చే ఆటుపోట్లను ఎదుర్కొనే శక్తి, సహనాన్ని పెంచుతాయి‘ అని పేర్కొన్నారు.ప్రభుత్వం క్రీడల ప్రోత్సాహానికి కట్టుబడి ఉందని ఆది శ్రీనివాస్ తెలిపారు.

‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యేక క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీయడానికి సీఎం కప్ను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించారు‘ అని వివరించారు.క్రీడాకారుల అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ తన వంతు సహాయం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.