11 July, 2026 | 1:52 AM

ఎస్‌ఐఆర్ నమోదు చేసుకున్న ప్రభుత్వ విప్

11-07-2026 12:29 AM

మహబూబాబాద్, జూలై 10 విజయ క్రాంతి): భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా మరిపెడ మున్సిపాలిటీలో నిర్వహించిన సహాయ శిబిరంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తమతో పాటు తమ కుటుంబ సభ్యుల ఓటరు నమోదు, సవరణకు సంబంధించిన ఫారాలను పి.ఎల్.ఓ ఉమకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అర్హత కలిగిన పౌరుడు తన ఓటరు వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు అవసరమైన సవరణలు పూర్తి చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు అని, ప్రతి ఒక్కరూ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ పెండ్లి రఘువీర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు గుగులోతు రవి నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి విశారపు శ్రీపాల్ రెడ్డి పాల్గొన్నారు.