11 July, 2026 | 1:52 AM

జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి

11-07-2026 12:28 AM

ఆర్టీసీ, రవాణా అధికారులకు టీడబ్ల్యూజేఎఫ్ వినతి

సికింద్రాబాద్, జూలై 10 (విజయక్రాంతి): జర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని కోరుతూ శుక్రవారం జర్నలిస్టులు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ, రవాణా అధి కారులకు వినతి పత్రాలు సమర్పించారు.

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టులు ఆర్టీసీ ఉన్నతాధికారులకు, డిపో మేనేజర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. హుస్నాబాద్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు, హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర రవాణా శాఖ అదనపు కార్యదర్శి సునీతాదేవీ లకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మా మిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ తదితరులు వినతిపత్రాలు సమర్పించారు.

అనంతరం వారు ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ లో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ఛైర్మెన్ వై.నాగిరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మా ట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సేవలందిస్తున్నారని, తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన ప్రభుత్వం పరిమిత సంఖ్యలో ఉన్న జర్నలిస్టులకు ఉచిత ప్రయా ణ సౌకర్యం కల్పించకపోవడం బాధాకరమని అన్నారు.

ప్రభుత్వం, ఆర్టీసీ సంస్థ చాలా ఏళ్ళుగా జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో 1/3 రాయితీ పై ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ పేరుకే 1/3 కానీ జర్నలిస్టుల నుం చి 50 శాతం చార్జీలు వసూలు చేస్తున్నారని అన్నారు. వార్తల సేకరణకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే జర్నలిస్టులకు ప్రయాణ చార్జీలు భారమవుతుందని,దీనిని దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా(తెలంగాణ ఎర్త్ వైడ్) ఉచిత ప్రయాణం, ఇతర రాష్ట్రాలకు 1/3 రాయితీ సదుపాయం కల్పించాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ రామారావు, పద్మనాభరావు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు వి. రవికుమార్, నాయకులు ఆర్. శ్రీనివాస్ గౌడ్,ఎం.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.