24 April, 2026 | 3:05 AM

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం మొండి వైఖరి

24-04-2026 01:50 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తీవ్ర ఆం దోళనను కలిగిస్తోందని, సమ్మెపై ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తెలిపారు. 41 రోజుల ముందుగానే నోటీసు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఆర్టీసీ కార్మికు ల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని, అన్ని జిల్లాల్లో పార్టీ నాయకులు, కార్యక ర్తలు వారికి సంఘీభావం తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి, వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్. రాంచందర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాం గ్రెస్ పార్టీ అమలు చేయడంలో   విఫలమైందన్నారు. 

కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ,  రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నర్సయ్య గౌడ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుళ్ల వీరేందర్ గౌడ్, భగీరథ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు ఉప్పరి రమేష్, ఎగ్గని నర్సిములు, బీబీఆర్ వేణు, పెద్దబుద్ధుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.