15 April, 2026 | 12:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రిజర్వేషన్ల అమలులో ప్రభుత్వాలు విఫలం

29-12-2025 12:00 AM

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం

బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్

తెలంగాణ విద్యార్థి సంఘం జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ

ముషీరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ విద్యార్థి సంఘం జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వే షన్ల కోసం అన్ని కుల, బీసీ, ఉద్యోగ, ప్రజా, న్యాయ, విద్యార్థి సంఘాలు ఒకే తాటిపైకి రావాలని పిలుపు నిచ్చారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఒక్క పార్లమెంట్ సభ్యుడితో కొట్లాడి రాష్ట్రాన్ని తీసు కొస్తే, వందల మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నా బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమయ్యాయని ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని ధ్వజమెత్తా రు. తెలంగాణ విద్యార్థి సంఘం జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీల కు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ మాట తప్పి మోసం చేసిందన్నారు. రాబోయే బీసీలకు రిజర్వేషన్లు కల్పించాకే జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, నందగోపాల్, ఉదయ్, జయంతి తదితరులు పాల్గొన్నారు.