29-12-2025 12:00:00 AM
సాయిబాబా మృతిపై ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం
సనత్‌గర్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): సాయిబాబా మృతితో మంచి మిత్రుడిని కోల్పోయానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి అధ్యక్షుడు సాయిబాబా శనివారం రాత్రి ఆకస్మిక మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం బేగంపేటలోని భగవంతాపూర్‌లో గల వారి నివాసానికి వెళ్లి సాయిబాబా పార్ధీవ దేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సాయిబాబా కుటుం బ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. ఎమ్మెల్యే వెంట బేగంపేట డివిజన్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, శేఖర్, ఆరీఫ్, జావీద్ తదితరులు ఉన్నారు.