29-12-2025 12:00:00 AM
కండువా కప్పి ఆహ్వానించిన అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): మేడ్చల్ -మల్కాజిగిరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు పానగట్ల చక్రపాణి గౌడ్ అధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గం, కుషాయిగూడ డివిజన్‌కి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షు డు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరిశంకర్‌గౌడ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగస్వామ్యం అయి, బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీలో చేరిన వారిలో సింగం అరుణ్, ఎం భాను ప్రకాష్, ఎల్ సురేందర్, ఎ కిరణ్, దేవేందర్, శ్రీకాంత్, మహిళ నాయకురాలు పి అనిత, సౌందర్య, శాలీని, వనజ, హరిత, మంజుల, రేణుక ఉన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్సయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయన అశోక్ ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి భావన వెంకటేష్, యువజన విభాగం అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్, మేడ్చల్ -మల్కాజ్‌గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి లక్కాకుల సంజీవ, టిఆర్పి నాయకులు మచ్చ పాండు గౌడ్, బయ్య వెంకటేశ్వర్లు యాదవ్, పాకాల నర్సింహ్మ, మురళీ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు