calender_icon.png 3 December, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తర తెలంగాణ.. సింహద్వారం!

03-12-2025 12:23:25 AM

పట్టాలెక్కుతున్న ప్యారడైజ్‌శామీర్‌పేట ఫ్లుఓవర్

రక్షణ శాఖకు చెందిన 65 ఎకరాల భూమి

అప్పగింతతో ముందుకు..

ఈపీసీ పద్ధతిలో రూ. 2,232.89 కోట్లతో నిర్మాణం

కరీంనగర్, సిద్దిపేట, పెద్దపల్లి, జగిత్యాల, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ప్రధాన రహదారి

దేశంలోనే పొడవైన ఎలివేటెడ్ రోడ్ కారిడార్‌గా రికార్డు

మొత్తం పొడవు 18.1 కి.మీ.. హకీంపేట వద్ద 450 మీటర్ల టన్నెల్  నర్మాణంలో నాణ్యత, పనులపై పర్యవేక్షణ అవసరం

నిర్దేశిత సమయంలోగా పూర్తిచేసేలా

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి సారించాలి 2029 ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా ఎలివేటెడ్ కారిడార్

హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి) : ‘దేశంలోనే పొడవైన ఎలివేటెడ్ రోడ్ కారిడార్’గా రికార్డు సృష్టించడానికి మరికొద్ది నెలల సమయం మిగిలింది. ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు ప్రధా న రహదారి అయిన రాజీవ్హ్రదారిపై సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు నిర్మిస్తోన్న ఎలివేటెడ్ రోడ్ కారిడార్‌కు సంవత్సరాల నిరీక్షణ తరువాత మోక్షం కలిగింది.

పనులు శరవేగం తో ప్రారంభించి నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోంది. ఉత్తర తెలంగాణకు సింహద్వారంగా పేర్కొనదగ్గ ప్యారడైజ్ పేట మధ్య నిర్మిస్తోన్న 18.1 కి.మీ. పొడవైన ఎలివేటెడ్ రోడ్ కారిడార్.. హైదరాబాద్‌ేొఉత్తర తెలంగాణ కారిడార్‌లో అభివృద్ధికి వంతెనలా మారనుంది.

రక్షణ శాఖ భూములతో ముందుకు..

జంటనగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌లను ఉత్తర తెలంగాణతో కలిపే ము ఖ్యమైన రహదారి రాజీవ్ రహదారి. అయితే ఈ రోడ్డులో పక్కా తెలంగాణ ప్రాంతాలు.. తిరుమలగిరి, ఆల్వాల్, బొల్లారం, యాప్రా ల్, హకీంపేట, శామీర్‌పేట, మేడ్చల్ లాంటి ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ అనేది సంవత్సరాలుగా సమస్యగా పరిణమించింది. 2015 లో ఈ ఎలివేటెడ్ రోడ్ కారిడార్‌కు డీపీఆర్ తయారైనా.. కేంద్ర రక్షణశాఖ పరిధిలోని 65 ఎకరాల భూముల బదలాయింపు అనే ది కీలకంగా మారింది.

కేంద్ర రక్షణశాఖతో మంతనాలు, సంప్రదింపుల అనంతరం ఎట్టకేలకు సరైన భూములను వేరే ప్రాంతంలో కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం నుంచి.. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన హామీ ఇవ్వడతో ఈ రోడ్ కారిడార్‌కు కావాల్సిన రక్షణ శాఖ భూములను బదలాయించేందుకు పచ్చజెండా ఊపారు. సాక్షా త్తు సీఎం రేవంత్‌రెడ్డి సారధ్యంలోనే దీనికి సంబంధించిన ఒప్పందం కూడా జరిగింది. దీనితో ఎలివేటెడ్ రోడ్ కారిడార్‌కు మార్గం సుగమం అయ్యింది.

రూ. 2,232.89 కోట్లతో..

ఈ రోడ్డును ఎలాగైనా నిర్మించి.. ఉత్తర తెలంగాణకు ఈ ఎలివేటెడ్ రోడ్ కారిడార్‌ను సింహద్వారంగా మార్చాలని సీఎం రేవంత్‌రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు దలతో సాధించింది. మొత్తం 197.2 ఎకరాల స్థలాన్ని సేకరించాల్సి ఉంది. ఇందులో రక్షణ శాఖకు చెందిన 65 ఎకరాలు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించడంతో పనుల్లో వే గం పెంచింది.

18.1 కి.మీ పొడవైన ఎలివేటె డ్ కారిడార్‌లో.. 11.65 కి.మీ పొడవైన ఫ్లుఓవర్ నిర్మించనున్నారు. హకీంపేట ఏయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద 450 మీటర్ల పొడవైన టన్నెల్ (సొరంగం) నిర్మించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టును రూ. 2232.89 కోట్లతో ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) పద్ధతిలో దీనిని నిర్మి ంచనున్నారు. ఈ నిధులను న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ) నుంచి రుణంగా తీసుకోనున్నారు.

ప్రగతికి మార్గం..

ప్యారడైజ్ మధ్యలో నిర్మిస్తున్న ఈ ఎలివేటెడ్ రోడ్ కారిడార్ అనేది కేవలం ఒక ఫ్లుఓవర్ కాదు.. దేశంలోనే పొడవైన ఎలివేటెడ్ రోడ్ కారిడార్‌గా చరిత్ర సృష్టించనుంది. పైగా 11 కి.మీ.లకుపైగా పొడవైన ఫ్లుఓవర్ కావడంతో అంతర్జాతీయ స్థాయిలో, ప్రమాణాలతో నిర్మిస్తున్న అర్బన్ కారిడార్‌గా గుర్తింపుపొందనుంది.

హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించనున్న కీలకమైన ప్రాజెక్టుగా ఇది నిలవనుంది. ఉత్తర తెలంగాణ మధ్యలో అభివృద్ధి, ప్రగ తికి ఇది మార్గంగా ఉపయోగపడనుం ది. పారిశ్రామికంగా కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలు మధ్యలో ఇండస్ట్రియల్ కారిడార్‌గా కూడా ఇది అభివృద్ధి చెం దనున్నది.

అయితే ఉన్నపళంగా ఇది పూర్తికాదు.. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించా ల్సిన సమస్యలు కొన్ని ఉండనే ఉన్నాయి. ఇందులో ప్రైవేటు భూముల సేకరణ, ఇప్పటికే కొందరు తమ తమ ఆస్థుల స్వాధీనంపై కోర్టుకు వెళ్ళారు. అలాగే ఈ ప్రాజెక్టు కోసం సేకరించే భూముల విషయంలో సహాయ, పునరావాస చర్యలు పకడ్బందీగా తీసుకోవాల్సి ఉంది. దీనితోపాటు రక్షణ విభాగం, దళాలున్న ప్రాంతాల్లో నిర్మాణ పనుల విషయంలో ప్రభుత్వం జోక్యం అవసరం.

గంటవరకు తగ్గనున్న సమయం.. 

ప్రతిరోజూ వందలాది బస్సులు, వేలాది వాహనాలు, లక్షలాది మంది ప్రయాణీకులతో ఉత్తర తెలంగాణ సింహద్వారం అనతగ్గ రాజీవ్ రహదారి కళకళలాడుతుంది. అయితే ప్యారడైజ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వరకు తీవ్రమైన ట్రాఫిక్ ఎప్పుడూ ఈ రోడ్డులో ప్రయాణీకులను భయపెడుతూనే ఉంటుంది.

పైగా ఈరోడ్డుకు ఇరువైపులా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు విస్తరించిన కార్యాలయాలు, వ్యాపార, విద్యా సంస్థలు, రెసిడెన్షియల్ కాలనీలకు వచ్చీపోయే ప్రజలతో నిత్యం రద్దీగా ఉంటుంది. అనేకచోట్ల ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద చాలాసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇక వర్షాకాలం సంగతి సరేసరి.. ఎప్పుడు ట్రాఫిక్ జాం అవుతుందో.. క్లియరెన్స్‌కు ఎంత సమయం పడుతుందో దేవుడికే తెలియాలి.

ఈ నేపథ్యంలో ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు ఎలివేటెడ్ రోడ్ కారిడార్ పూర్తయితే.. రోడ్డుకు ఇరువైపులా కాలనీలకు, వ్యాపార, విద్యా సంస్థలకు వెళ్లేవారికీ ఎలాంటి అడ్డంకులు ఉండవు. అలాగే సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లవైపు వెళ్లేవారు నిరాఘాటంగా ప్రయాణించవచ్చు. ఎలాంటి ట్రాఫిక్, సిగ్నళ్లు, మూలమలుపులు లేకుండా ప్యారడైజ్ నుంచి నేరుగా శామీర్‌పేట వరకు ప్రయాణించే వెసులుబాటు కలుగుతుంది. దీనివల్ల సుమారు గంట ప్రయాణ సమయం తగ్గుతుందని అంచనా.

వచ్చే ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా.. 

ఈ ప్రాజెక్టు పూర్తయితే క్రెడిట్ అంతా సీఎం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇందుకు ఏకైక మార్గం..  నిర్దిష్ట కాలంలో ఎలివేటెడ్ కారిడార్‌ను పూర్తిచేయడమే. ఇందుకు ప్రత్యేకంగా సీఎం చర్యలు తీసుకోవాలి. ఈ ఎలివేటెడ్ రోడ్ కారిడార్‌ను ఒక కొలిక్కి తీసుకురావడానికి సీఎం ఎంతో కృషి చేశారు.

ఈ నేపథ్యంలో దీనిని సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యతతోపాటు.. నాణ్యతతో చేయించాల్సిన బాధ్యతకూడా ఆయనపై ఉంది. ఎందుకంటే.. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజల ఎన్నో ఏండ్ల కల ఇది. దీనిని సకాలంలో పూర్తిచేస్తే.. 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రధాన ప్రచారాస్త్రంగా మారుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు.

పనుల్లో నాణ్యత.. పర్యవేక్షణ అవసరం.. 

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ని ర్మాణం విషయంలో ప్రభుత్వం దృ ష్టి పెట్టాల్సిన అంశాలు మూడు ఉన్నాయి. ఇందులో ఈ ఎలివేటెడ్ రోడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి ప్రతి వారం, ప్రతి నెల నిర్దేశిం చుకున్న పనులు.. పూర్తయ్యాయా లేవా.. అనేలా పర్యవేక్షించాల్సిన బా ధ్యత ప్రభుత్వంపై ఉంది.

ఇందుకు ఒక ఉన్నతాధికారుల బృందాన్ని పురమాయిస్తేగానీ అనుకున్న సమయంలోగా పూర్తిచేయలేం. ఇక రెం డో అంశం.. నాణ్యత.. ఈ విషయం లో ఇంజనీరింగు విభాగంతోపాటు. క్యాలిటీ కంట్రోల్ విభాగం కూడా ప్రతినిర్మాణ పనిపై దృష్టి సారించాల్సి ఉంది. అలా చేస్తేగానీ.. ఉత్తర తెలంగాణకు సింహద్వారంగా చెప్పుకునే ఈ ఎలివేటెడ్ రోడ్ కారిడార్ పదికాలాల పాటు నిలుస్తుంది.   పర్యవేక్షణ.

డీపీఆర్ తయారీ నుంచి మొదలుకుని.. ఎలివేటెడ్ రోడ్ కారిడార్ నిర్మాణం పూర్తయ్యేవరకు పర్యవేక్షణ అనేది తప్పనిసరి.  సగం రాష్ట్రానికి ఇది ప్రధాన రహదారి కావడంతో అదేస్థాయిలో దృష్టి సా రించాల్సిన అవసరం ఉంది. నిర్మా ణ పనులు సరిగాసాగుతున్నా యా.. సాంకేతికాంశాలు, ఇంజనీరింగు అంశాల పరంగా ఎలాంటి లోటు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యతలను ఒక బృందా నికి అప్పగించాలి. తద్వారా అనుకున్నట్టుగా.. అనుకున్న పనులు.. అనుకున్న సమయంలోగా పూర్తిచేసి శభాష్ అనిపించుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఒడిసిపట్టుకోవాలి.