4 July, 2026 | 9:51 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

రైతు సంక్షేమానికి ప్రభుత్వ పెద్దపీట

19-10-2024 12:33 AM

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు

రామాయంపేట/చిన్నశంకరంపేట, అక్టోబర్ 18: రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. చిన్నశంకరంపేట, పాపన్నపేట, రామాయంపేట, నిజాంపేట, హవేళీఘణపూర్ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 473 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.