calender_icon.png 6 October, 2025 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెట్ మినహాయింపునకు ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేయాలి

06-10-2025 12:00:00 AM

* ఎస్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు హనుమంత రెడ్డి

* అచ్చంపేట, ఉప్పునుంతల మండలాల కార్యవర్గాలు ఏకగ్రీవ ఎన్నిక

అచ్చంపేట అక్టోబర్ 5 : రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎస్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు హనుమత్ రెడ్డి అన్నారు. ఆదివారం అచ్చంపేటలో నిర్వహించిన సమావేశంలో అచ్చంపేట, ఉప్పునుంతల మండలాల యూనియన్ కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షులుతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త శ్రీధర్ రావు వ్యవహరించారు.

హనుమంత్ రెడ్డి మా ట్లాడుతూ దశాబ్దాలగా వృత్తిలో ఉన్న ఉపాధ్యాయుల విషయంలో.. ఆందోళనకరంగా తయారైన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఉత్తర్వులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు. టెట్ నుంచి మినహాయింపు ఇప్పించాలని, ఎన్సిటీఈ మార్గదర్శకాలను అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొనాలన్నారు. 2010 కంటే ముందుగా ని యామకమైన ఉపాధ్యాయులను విధిగా మినహాయించాలని విద్యార్థి హక్కు చట్టం సరి చేయాలన్నారు.

మండల కార్యవర్గాలు ఎన్నిక

అచ్చంపేట మండల అధ్యక్ష కార్యదర్శులుగా నారాయణ గౌడ్, కొండ భాస్కర్ , ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్ సృజన , సరస్వతి, ఆర్థిక కార్యదర్శిగా ధనలక్ష్మి , కార్యవర్గ సభ్యులుగా రామ చంద్రం,  స్వరూప , మాధవి, పారిజాతం, జిల్లా కౌన్సిలర్లు  సుదర్శన్, విక్రమ్, అర్జునయ్య ,బ్ర హ్మేంద్ర యాదవ్ , శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  ఉప్పునుంతల మండల అధ్యక్ష కార్యదర్శులుగా కపిలవాయి విష్ణుమూర్తి, చంద్రశేఖర్లు ఉపాధ్యక్షులు జి శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, ఆర్థి క కార్యదర్శులు ఎన్ వెంకటయ్య, ఓంకార్ జిల్లా కౌన్సిలర్స్ గా పోకల సతీష్, రవి శేఖర్, రాములు నాయక్ లను ఏకగ్రీవంగాఎన్నుకున్నారు.