calender_icon.png 4 December, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

04-12-2025 12:00:00 AM

గరిడేపల్లి, డిసెంబర్ 3 : సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహలు అన్నారు. మండలంలోని గడ్డిపల్లి, పొనుగోడు, గరిడేపల్లి పోలింగ్ స్టేషన్లను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బుధవారం నుంచి శుక్రవారం వరకు హుజూర్నగర్ నియోజకవర్గంలోని 146 గ్రామపంచాయతీలకు, 1318 వార్డులకు, 38 క్లస్టర్ల పరిధిలో నామినేషన్స్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నామినేషన్ వేసే అభ్యర్థులు ముందస్తుగా అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని, చివరి క్షణాల్లో ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నామినేషన్ వేసే సమయంలో సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్  నివృత్తి చేసుకోవాలన్నారు. నామినేషన్ వివరాలను ఎప్పటికప్పుడు యాప్ లో నమోదు చేయాలని చివరి రోజు ఎక్కువ మంది అభ్యర్థులు వచ్చి అవకాశం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

గడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో గడ్డిపల్లి, కుతుబ్ షాపురం,చిన్న గారకుంట తండా, మర్రికుంట పొనుగోడు, గ్రామపంచాయతీ కార్యాలయంలో పోనుగోడు, రామచంద్రాపురం, అప్పన్నపేట, కోదండరాంపురం గ్రామపంచాయతీ సర్పంచులకు, వార్డు సభ్యులకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.

తదుపరి ఎస్పీ నరసింహ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగిన పట్టిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే వాహనాలను, ప్రజలను నిలిపివేసి అభ్యర్థితో కేవలం ముగ్గురు మాత్రమే నామినేషన్ వేసేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు. నేర చరిత్ర గల వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేయటం జరిగిందని తెలిపారు. 

పోలింగ్ జరిగేటప్పుడు, కౌంటింగ్ నిర్వహించేటప్పుడు పట్టిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని కౌంటింగ్ పూర్తి అయిన అనంతరం గ్రామాలలో బాణాసంచా పిలుస్తూ, డీజే సౌండ్ లతో ర్యాలీలు నిర్వహించడం వద్దని,వీటిపై నిషేధిత ఆత్మలు అమలులో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీడీవో సరోజ, తాసిల్దార్ స్రవంతి, సీఐ చరమందరాజు, ఎస్‌ఐ నరేష్, ఆర్వోలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.