calender_icon.png 8 December, 2025 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్యం దిశగా రేవంత్ సర్కార్ విజన్: గవర్నర్

08-12-2025 02:26:24 PM

  1. వికసిత్ భారత్ దిశగా వేగంగా తెలంగాణ
  2. ఆవిష్కరణల్లో అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణ
  3. లక్ష్యం దిశగా రేవంత్ సర్కార్

హైదరాబాద్: రేవంత్ రెడ్డి(Revanth Reddy) నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) అన్నారు. ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit)ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ప్రారంభించారు. గ్లోబల్ సమ్మిట్ కు హాజరైన గవర్నర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 

వికసిత్ భారత్(Viksit Bharat)2047లో  తెలంగాణ రైజింగ్ ఓ భాగమని తెలిపారు. నిర్ణీత లక్ష్యాలు నిర్దేశించుకుని తెలంగాణ ముందుకెళ్తోందని గవర్నర్ కొనియాడారు. 2047 లోగా 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారాలనేదే సర్కార్ లక్ష్యమని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ అడుగులేస్తోందని చెప్పారు. మహిళా రైతులను పలు విధాలుగా ప్రోత్సహిస్తున్నామని గవర్నర్(Governor) వెల్లడించారు. బస్సుల నిర్వహణ కూడా మహిళ సంఘాలకు ఇచ్చామని సూచించారు. రేవంత్ రెడ్డిది.. స్థిరమైన, పారదర్శక ప్రభుత్వం అన్నారు. ఆవిష్కరణల్లో తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే ముందుందని కొనియాడారు. అన్ని రంగాల్లో తెలంగాణ విప్లవాత్మక మార్పులు తెస్తుందన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ తెలంగాణ సాధిస్తుందని నమ్మకం ఉందని గవర్నర్ స్పష్టం చేశారు.