08-12-2025 02:28:04 PM
ఏకగ్రీవంగా సర్పంచ్–ఉపసర్పంచ్ ఎన్నిక
కోదాడ,(గుడిగూడెం): నడిగూడెం మండలం బృందావనపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికారంలోకి రావడం గ్రామ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచింది. గ్రామ సర్పంచ్‌గా కంభంపాటి సరిత చైతన్య, ఉపసర్పంచ్‌గా పుట్టా సైదమ్మ రమేష్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రజల విశ్వాసమే మా బలం… బృందావనపురం అభివృద్ధే మా లక్ష్యం అని సర్పంచ్ కంభంపాటి సరిత చైతన్య పేర్కొన్నారు.
గ్రామ ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిజాయితీతో నిర్వహించి ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా పాలన సాగిస్తామని ఆమె తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజల సహకారం వల్లే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. ఈ విజయం వ్యక్తిగతం కాదు… ఇది బృందావనపురం గ్రామ ప్రజల విజయమే” అని, గ్రామంలోని అన్ని పార్టీలు సమన్వయంతో నా గెలుపుకు కృషి చేశారని సర్పంచ్ స్పష్టం చేశారు.
గ్రామ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొత్త పాలకవర్గం పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొండా ఉపేందర్, మాదా సావిత్రమ్మ, 8వ వార్డు మెంబర్ మాధా వీరబాబు, మాధా నాగరాజు, నోషిన్ అంజయ్య, మాతంగి మాధవరావు, గ్రామ శాఖ అధ్యక్షులు బొడ్డు గోవర్ధన్, పుట్టా చంద్రయ్య, రేపాల ఉషారాణి పురుషోత్తం, నారగాని వెంకన్న, మాజీ సర్పంచ్ బెల్లంకొండ హనుమయ్య, గద్దల అంజయ్య, నోషీన్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.