calender_icon.png 24 November, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు

24-11-2025 01:40:10 PM

కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాటం వెంకటేశం

చిట్యాల,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్దే ధ్యేయంగా  వివిధ సంక్షేమ పథకాలను అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాటం వెంకటేశం అన్నారు. సోమవారం  చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో జిల్లా సమైక్య మహిళా అధ్యక్షురాలు ఆవుల మాధవి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాటం వెంకటేశం  పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి అవకాశం కూడా మహిళలకే ఇస్తున్నారని, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఉచితబస్సు, 500 కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ చీరలు, క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లను వివిధ పథకాల సంక్షేమ పథకాలను అందిస్తున్నారని పేర్కొన్నారు. 

మహిళలను  లక్షాధికారులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి  నాయకత్వంలో జిల్లా మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం ఆశీస్సులతో  పెద్దకాపర్తికి 62 ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని, అవి పూర్తి అయిన వెంటనే రెండో విడత ఇవ్వడానికి ఎమ్మెల్యే సానుకూలంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ కంచర్ల గౌతంరెడ్డి, ఎద్దుల లక్ష్మి, ఏర్పుల శ్రీలత, నీలకంఠ లింగస్వామి, ఏర్పుల నరసింహ, తెల్సూరి సైదులు, సాగర్ల నాగరాజు, ఏర్పుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.