calender_icon.png 24 November, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండోటెస్టు: భారత్‌కు ఫాలో ఆన్ గండం

24-11-2025 12:50:34 PM

రెండో టెస్టులో భారత బ్యాటర్ల దారుణ ప్రదర్శన

గువాహటి టెస్టు మ్యాచ్ లో భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. భారత్ తొలి ఇన్నింగ్స్(India's first innings)లో 122 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. మార్కో యాన్సన్ బౌలింగ్ లో (43.3) వద్ద రవీంద్ర జడేజా(06) వికెట్ కీపర్ కైల్ వెరీన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చేసి రెండో టెస్టులో భారత జట్లు ఫాలో ఆన్ ముప్పులో పడింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఇంకా 350కి పైగా పరుగుల వెనుకంజలో ఉంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 151.1 ఓవర్లలో 489 పరుగులు చేసింది. ప్రస్తుతం 56 ఓవర్లకు టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(23), కుల్దీప్ యాదవ్(7) నిలకడగా ఆడుతున్నారు.  ఫాలో ఆన్ గండం నుంచి బయటపడాలంటే భారత్ కు మరో 149 పరుగులు అవసరం.