06-12-2025 05:41:41 PM
నిర్మల్ (విజయక్రాంతి): జాతీయ న్యాయ సేవ సంస్థ పిలుపుమేరకు ఈనెల 21న జరిగి జాతీయ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేద్దామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి అన్నారు. శనివారం మరో న్యాయమూర్తి రాధిక జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి అదాలత్ లతో కేసుల పరిష్కారం తదితర అంశాలపై పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. చిన్న చిన్న కేసులతో పాటు కుటుంబ సమస్యలకు కేసులు పరిష్కరించేందుకు దీన్ని వినియోగించుకోవాలని దీనిపై బాధితులకు పూర్తి వివరాలు తెలియజేయాలని సూచించారు. ప్రజలు లోక అదాలకు సద్వినియోగం చేసుకొని సత్వర న్యాయం పొందాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు పోలీసు సిబ్బంది ఉన్నారు.