calender_icon.png 14 January, 2026 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రేస్ సర్వీస్ సొసైటీ సామాజిక సేవలు ప్రశంసనీయం

13-01-2026 12:00:00 AM

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

మణుగూరు, జనవరి12 (విజయక్రాంతి) :సమాజంలో పేదరికం, నిరక్షరాస్యత, వంటి సమస్యలను గుర్తించి, తన వంతు గా సమాజానికి ఎంతోకొంత చేయాలనే తపనతో ముందుకు సా గుతున్నా గ్రేస్ సర్వీస్ సొసైటీ సామాజిక సేవలు ప్రశం సనీయమని, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.గ్రేస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రేస్ మిషన్ స్కూల్ ఆవరణ లో సోమవారం పేద, వృద్ధులు, వితంతు వులకు దుప్పట్లు, చీరలు,నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే పం పిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీలో పలు సేవా కార్యక్రమాలద్వారా ఎంతో మందికి గ్రేస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు రేవా ఎం. జాకాబ్ స్ఫూర్తిగా నిలిచారని, క రోనా సమయంలో ఆయన పేదలకు చేసిన సహాయాలు మరువలేని వన్నారు. కార్యక్రమంలో గ్రేస్ సర్వీస్ సొ సైటీ వ్యవస్థాపక అధ్యక్షులు జాకాబ్,మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పీరి నాకీ నవీన్, బోనగిరిశివ సైదులు,శివాల యం చైర్మన్ కూచిపూడి బాబు, సింగారం విప్పల సిం గారం, లంక మల్లారం, గుట్ట మల్లారం సర్పంచ్ లు కలబోయిన మాధ వరావు,పాల్వంచ రా ములు,పూణెం రమే ష్,కారం పూజిత, గాండ్ల సురేష్, మధు కిరణ్, లాలయ్య, గ్రేస్ సొసైటీ నిర్వాహకు లు పుల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు.