calender_icon.png 14 January, 2026 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నొడ్ల బోనస్ 500 కోట్లు విడుదల

13-01-2026 12:00:00 AM

  1. ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి..
  2. ఇప్పటివరకు రూ.1,429 కోట్లు రైతుల ఖాతాల్లో జమ 

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాం గానికి సంక్రాంతి పండుగ వేళ గుడ్ న్యూస్ చెప్పింది. సర్కార్ కొనుగోలు చేసిన సన్న వరి ధాన్యానికి సంబంధించి బోనస్ డబ్బు లు రూ.500 కోట్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సోమవారం విడుదల చేసింది. దీంతో వానాకాలం సీజన్‌కు సంబంధించి మొత్తం రూ.1,429 కోట్ల బోనస్ నిధులను ప్రభు త్వం విడుదల చేసినట్లయింది. సన్నరకం వడ్లు పండించిన రైతులకు కనీస మద్దతు ధరతో పాటు  క్వింటాకు అదనంగా రూ. 500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత వారి వివరాలను నమోదు చేసుకుని, మద్దతు ధరతో పా టు బోనస్ మొత్తాన్ని నేరుగా వారి బ్యాం కు ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. మద్దతు ధర డబ్బులు వరిధాన్యం కొనుగోలు చేసి, వెంట నే జమ చేసింది. అయితే బోనస్ డబ్బులు మాత్రం విడతల వారీగా రైతులకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తున్నది. పండుగ సమయంలో రైతుల చేతికి బోనస్ డబ్బులు అం దనుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.