13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

మంచుకొండ ఎత్తిపోతల పథకం ప్రారంభానికి రైతులు పెద్ద ఎత్తున హాజరుకావాలి

13-01-2026 12:00 AM

మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మం, జనవరి 12 (విజయ క్రాంతి): మంచుకొండ ఎత్తిపోతల పథకం ప్రారంభానికి రైతులు పెద్ద ఎత్తున హాజరు కావాలని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.మంత్రి, సోమవారం రఘు నాథపాలెం మండలంలో రాములు తండా నుంచి చింతగుర్తి కొర్లబోడు తండా క్రాస్ రోడ్డు వరకు 2.5 కోట్లతో చేపట్టిన బీటీ రో డ్డు నిర్మాణ పనులకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి శంకు స్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి తు మ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామానికి 10 లక్షల రూ పాయల గ్రాంట్ అందిస్తామని అన్నారు. ప్రజ లకు ఇచ్చిన మాట మేరకు గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అ న్నారు.

మహిళలకు ప్రభుత్వం నాణ్యమైన చీ రలను ఉచితంగా పంపిణీ చేసిందని, పెద్ద వ యస్సు గల మహిళలకు ప్రత్యేకమైన డిజైన్ అందించామని అన్నారు. సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూ పాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీ సీ బస్సులో ఉచిత ప్రయాణం వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.

రైతులకు సాగునీరు అం దించేందుకు చేపట్టిన మంచుకొండ ఎత్తిపోతల పథకం పూర్తయిందని, ఆ ప్రాజెక్టు క్రిం ద నీళ్ళు వదిలే కార్యక్రమానికి రైతులు, ప్రజ లు పెద్ద ఎత్తున హాజరు కావాలని మంత్రి పి లుపు నిచ్చారు. మండలంలో 3వ పంటకు సైతం సాగునీరు అందించేందుకు తాము సి ద్ధంగా ఉన్నామని, రైతులు పెద్ద ఎత్తున పా మాయిల్ పంట సాగు చేయాలని అన్నారు. ఆయిల్ పామ్ పంటతో రైతులకు మంచి లాభాలు వస్తాయని, అంతర్ పంటల క్రింద కూర గాయలు, పత్తి, పప్పులు సాగు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, రాములు తాండ సర్పంచ్ బానోతు వెంకట్రాం, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.