22 April, 2026 | 2:09 AM

ఖాసీంభౌలి అంగన్ వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే..

22-04-2026 12:29 AM

ముఖ్యఅతిథిగా ఖాసీంభౌలి గ్రామ సర్పంచ్ మాడి రాజేందర్ రెడ్డి 

మొయినాబాద్ ఏప్రిల్ 21(విజయక్రాంతి): మొయినాబాద్ మండల పరిధిలోని ఖాసీంభౌలి గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రంలో మంగళవారం ఘనంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ మాడి రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిన్నారులకు అంగన్ వాడీ కేంద్రంలో ఐదు సంవత్సరాల చదువు పూర్తి చేసి ఒకటో తరగతికి అర్హత పొందిన పిల్లలకు ధ్రువపత్రాలను ఆయన చేతుల మీదగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాడి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పిల్లలను తప్పకుండా అంగన్ వాడీ కేంద్రాలకు పంపించాలని తల్లిదండ్రులను కోరారు.

అదేవిధంగా పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు. అంగన్ వాడీ కేంద్రాలకు వెళ్లే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న ప్రోత్సాహకాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు కల్పన, గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.