22 April, 2026 | 2:08 AM

కేసీఆర్ చావును కోరుకోలేదు

22-04-2026 12:28 AM
  1. ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లుపై అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజర్ 
  2. కాళేశ్వరం కేసు సీబీఐ విచారణ జరిగేలా కేంద్ర సహాయ మంత్రి చర్యలు తీసుకోవాలి
  3. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కరీంనగర్, ఏప్రిల్21(విజయక్రాంతి): తెలంగాణ మాజీ సీఎం చావును ఎవరూ కోరుకోలేదని, ఎస్సీ వర్గీకరణ బిల్లు సందర్భంగా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరితే కూడా అసెంబ్లీకి రాలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

మంగళవారం కరీంనగర్‌లోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్లూరి మాట్లాడుతూ.. 20న కేసీఆర్ మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయంలోనూ సీఎం రేవంత్ ఆహ్వానిస్తే అసెంబ్లీకి రాలేదన్నారు. 

అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి..

ఈ ప్రభుత్వం అణగారిన వర్గాల అభ్యున్నతికి, ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తుందని అడ్లూరి అన్నారు. చదువు ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ప్రశాంత్, సలహాదారులు సైదా, ఉద్యోగుల సంఘల సహకార సంఘం అధ్యక్షుడు రెడ్ల రాజేశ్వర్, అడిషనల్ సెక్రటరీ సునీత, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ప్రధానకార్యదర్శి ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.