23 May, 2026 | 1:10 AM

నిబంధనల ప్రకారం ధాన్యాన్ని నిలువ చేయాలి

23-05-2026 12:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, మే 22 (విజయక్రాంతి) : కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని కేటాయించిన గోదాములు, రైస్ మిల్లుల్లో నిబంధనల ప్రకారం నిలువ చేయాలని గోదాము, మిల్లు నిర్వాహాకులను కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలోని స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ గోదామును మండల తహసిల్దార్ సంతోష్ తో, జైపూర్ మండలం ముదిగుంటలోని బీ ఎస్ వై రైస్ మిల్, ఇందారంలోని వరలక్ష్మీ రైస్ మిల్, టేకుమట్ల లోగల బాలాజీ గోదాం, కుందారంలో గల అన్నపూర్ణ రైస్ మిల్ గోదాములను మండల తహసిల్దార్ వనజ రెడ్డితో, హాజీపూర్ మండల కేంద్రంలోని గాయత్రి రైస్ మిల్ ను తహసిల్దార్ పుష్పలతతో కలిసి సందర్శించి ధాన్యం నిలువ చేసే ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుంచి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. మిల్లులు, గోదాములకు తరలించిన ధాన్యం దిగుమతిలో ఆలస్యం లేకుండా అవసరమైన హమాలీల సంఖ్యను పెంచుకోవాలని, లారీలు వేచి ఉండకుండా తిరిగి పంపించాలని కోరారు. రైస్ మిల్లర్లకు నిర్దేశించిన లక్ష్యాలను త్వరగా పూర్తి చేసే విధంగా కృషి చేయాలన్నారు. సీఎంఆర్ లక్ష్యాలను వేగంగా పూర్తి చేసేలా రైస్ మిల్లుల యజమానులు అధికారుల సమన్వయంతో కృషి చేయాలన్నారు.