9 June, 2026 | 1:13 AM

95 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి

09-06-2026 12:00 AM
  1. చివరి దశలో ధాన్యం కొనుగోళ్లు 
  2. జిల్లా వ్యాప్తంగా 268 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేత
  3. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, జూన్ 8 (విజయ క్రాంతి) : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు 95 శాతం పూర్తి అయినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుంచి గూగుల్ మీట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతి మా సింగ్ మాట్లాడుతూ..చివరి దశలో ధా న్యం కొనుగోళ్లు చేస్తున్నామని, అకాల వ ర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.

జిల్లా వ్యాప్తంగా 82, 251 మంది రైతుల నుంచి 3,80,358 .240 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, 65,394 మంది రైతులకు  694,32 కోట్ల రూపాయలు చెల్లింపులు పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 268 ధాన్యం కొను గోలు కేంద్రాలు మూసివేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు పూర్తి అయిన కేంద్రాల్లో ని సిబ్బంది, వాహనాలు, హమాలీనీ ధా న్యం కొనుగోళ్లు నడుస్తున్న కేంద్రాల్లో ఉపయోగించాలని అధికారులను ఆదేశించారు.

అధికారులు అప్రమత్తంగా ఉండి త్వరిత గ తిన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నా రు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్ట ర్ నగేష్, సివిల్ సప్లై శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఆర్డీవోలు, తహ శీల్దార్లు, ధాన్యం సేకరణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎం గోదాం త్రైమాసిక తనిఖీ 

ఈవీఎం గోదాం ను జిల్లా కలెక్టర్ ప్రతి మా సింగ్  త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. సోమవారం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను గు ర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్ర తినిధుల సమక్షంలో త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్తింపు పొం దిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాం సీల్ ను పరిశీలించారు. గోదాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, అగ్నిప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఇతర భద్రతా పరికరాలను తనిఖీ చేశారు.

అత్యవసర పరిస్థితులు తలెత్తిన సందర్భంలో అనుసరించాల్సిన భద్రతా చర్యలపై సంబంధిత సిబ్బందికి సూచనలు జారీ చేశారు. గోదాం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, భద్రతా రిజిస్టర్లు, సందర్శకుల నమో దు పుస్తకాలను పరిశీలించారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదని భద్రతా సిబ్బందిని ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ, భారత ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు ఈవీఎంలు, వీవీప్యా ట్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ గఫార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.