వేగంగా ధాన్యం కొనుగోళ్లు: స్టీఫెన్ రవీంద్ర
హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటీ వరకు 45.2 లక్షల మెట్రిక్ ( ఎల్‌ఎంటీ) టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ధాన్యం కొనుగోలు చేసి వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా జమ చేస్తున్నట్లు సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్ స్టీపెన్ రవీంద్ర బుధవారం ఒక ప్రకనటలో తెలిపారు. 6.3 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,508 వేల కోట్లు జమ చేసినట్లు చెప్పారు.
వరి ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రంలో 5,575 కేంద్రాలు పని చేస్తున్నాయని, ధాన్యం గోదాంల్లోకి తరలించేందుకు 13,100 వరకు వాహనాలను సమకూర్చినట్లు చెప్పారు. అత్యధికంగా నిజాబాబాద్‌లో 6.30 ఎల్‌ఎంటీ, నల్లగొండలో 5.8, కామారెడ్డిలో 3.2, సూర్యాపేటలో 2.90, పెద్దపల్లిలో 2.40 ఎల్‌ఎంటీ వరిధాన్యం కొన్నట్లు పేర్కొన్నారు.






