08-12-2025 12:49:04 AM
తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), డిసెంబర్ 7 (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్ నిర్వాహకులకు సూచించారు.ఆదివారం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంటాలైన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని చెప్పారు.రైతుల ఖాతాల్లో కనీస మద్దతు ధర చెల్లింపులను ఆలస్యం చేయకుండా వెంటనే జమ చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దేవరకొండ విజయ,నిమ్మల నాగమ్మ,రైతులు,హమాలీలు తదితరులు పాల్గొన్నారు.