16-10-2025 12:12:12 AM
కలెక్టర్ హైమావతి
బెజ్జంకి, అక్టోబర్ 15 : బెజ్జంకి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో వరి ధాన్య కొనుగోలు పక్రియను జిల్లా కలెక్టర్ కె. హైమావతి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.క్రితం సీజన్ లో 12 వేల క్వింటాల పైగా వరి ధాన్యం కొన్నామని ఏఏంసి ప్రాంతంలో వరి కోతలు మొదలయ్యాయని సిబ్బంది కలెక్టర్ కి తెలిపారు.
ఏఏంసి మొత్తం తిరిగి పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన తేమశాతం రాగానే గన్ని ల్లో నింపాలని ఆదేశించారు. తేమశాతం చెక్ చేశారు తేమశాతం వచ్చిన కూడా గన్ని లలో నింపట్లేదని అడగ్గా ధాన్యం ఆన్ లోడింగ్ మిల్లు కేటాయించలేదని సెంటర్ సిబ్బంది తెలపగా వెంటనే అన్ని వరిధాన్య కొనుగోలు కేంద్రాలకు ఆయా దగ్గరలోని రైస్ మిల్స్లను కేటాయించే ప్రక్రియను త్వరగా పూర్తి చెయ్యాలని డీసీఎస్‌ఓ నీ ఫోన్ ద్వారా ఆదేశించారు.
రైతులు ఎవ్వరు దళారుల వద్దకు వెళ్లి నష్టపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం అమ్ముకోవాలని, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్ లింక్, ఆధార్ అప్డేట్ చేసుకుంటే పేమెంట్ లో ఎలాంటి సాంకేతిక సమస్యలు రావని రైతులకు పిలుపునిచ్చారు. అనంతరం బెజ్జంకీ మండల కేంద్రంలోని పలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
బండి పల్లి మణెమ్మ ఇళ్లు పరిశీలిస్తూ బాగా కట్టుకుంటున్నారని ఎన్ని బిల్లులు వచ్చాయని కలెక్టర్ అడగ్గా 3 బిల్లులు 4 లక్షలు వచ్చాయనీ మొత్తం నిర్మాణం పూర్తి కాగానే ఫైనల్ క్యాప్చర్ చేస్తానని ఏ ఈ హౌసింగ్ కలెక్టర్ కి తెలిపారు. అలాగే బండి పల్లి రాజవ్వ ఇంటిని పరిశీలిస్తూ నిర్మాణం వేగంగా పూర్తి చెయ్యాలని పే మెంట్ గూర్చి కలెక్టర్ అడగ్గా 2 బిల్లులు 2 లక్షలు అకౌంట్ లో పడ్డాయని స్లాప్ పే- మెంట్ క్యాప్చర్ చేశానని ఏ ఈ కలెక్టర్ కి తెలిపారు. తహసిల్దార్ శ్రీకాంత్, ఎంపిడిఓ తదితరులు ఉన్నారు.