26 August, 2026 | 9:26 PM

ఒకరి అవయవదానం.. నలుగురికి ప్రాణదానం

21-05-2024 02:44 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20(విజయక్రాంతి) : బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ కుటుంబసభ్యులు ఆమె అవయవాలను దానం చేసి, మరో నలుగురి ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా, మోతె మండలం, తుమ్మగూడెంకి చెందిన ఉబ్బిపెల్లి ఉమ(34)కు నగరంలోని కొత్తపేట, ఎన్టీఆర్ నగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో ఆమె తలకు బలమైన గాయం కావడంతో, బ్రెయిన్ డెడ్ అయింది. వైద్యుల సూచనల మేరకు ఆమె భర్త మధుసుదన్ అవయవాలను దానం చేయడానికి అంగీకరించి మానవీయతను చాటుకున్నాడు.