05-09-2025 12:43:48 AM
ములకలపల్లి, సెప్టెంబర్ 4,( విజయక్రాంతి): గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని సిఐటియు ( సిపిఎం అనుబంధ) మండల కన్వీనర్ ని మ్మల మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంపిఓ వెం కటేశ్వర్లుకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు తక్షణ మే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమ లు చేయకపోతే గత బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని ఎద్దేవా చేశారు. కార్మికులను పీఆర్సి పరిధిలోకి చేర్చి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వమే లైసెన్స్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీగా ఉద్యమాలను నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల నాయకులు వర్క రుక్మధరావు, మేకల రమేష్, కమ్మంపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.